మీ అప్పులు మేము తీరుస్తాం.. GHMCకి ప్రభుత్వం గుడ్ న్యూస్!

by Prasad Jukanti |

జీహెచ్‌ఎంసీకి ఉన్న రూ.4,780 కోట్ల అప్పులను తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేయబోతున్నట్లు సమాచారం.

మీ అప్పులు మేము తీరుస్తాం..  GHMCకి ప్రభుత్వం గుడ్ న్యూస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ అప్పులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బల్దియా అప్పులను టేకోవర్‌ చేసేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీకి ఉన్న ఉన్న రూ.4,780 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేసి వాటిని చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లుగా విడిపోవడంతో అప్పుల విభజన కోసం ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు అప్పులు పంచితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అందువల్ల ప్రభుత్వమే పూర్తి అప్పుల బాధ్యతలను తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తలకు మించిన భారం:

పెరిగిపోయిన అవసరాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పన ఇన్నాళ్లు జీహెచ్ఎంసీకి పెను భారంగా మారింది. ముఖ్యంగా 2014 నుంచి హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, కొత్త డ్రైనేజీ నాళాలు వంటి వసతుల నిర్మాణానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ. 7 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఈ రుణాలపై గత రెండేళ్లుగా ప్రతి నెల సుమారు రూ. 100 కోట్ల వరకు జీహెచ్ఎంసీ వడ్డీల భారం భరిస్తోంది. వీటికి తోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే బల్దియా అప్పులను టేకోవర్ చేయడం ద్వారా ట్రైకార్పోరేషన్లకు ఆర్థిక భారం లేకుండా చేయవచ్చని అధికారులు ప్రభుత్వానికి సూచించిననట్లు తెలుస్తోంది.

Next Story