- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కాళేశ్వరం విషయంలో సర్కార్ మరో BIG స్టెప్.. కేంద్రానికి లేఖ
కేంద్ర హోంశాఖ(Union Home Ministry)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) లేఖ రాసింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ(Union Home Ministry)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నివేదిక ఆధారంగా సీబీఐ(CBI) చేత విచారణ చేయించాలని కోరింది. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా, సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి, ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్(Irrigation Department) డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పైన కూడా దర్యాప్తునకు సూచించింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన అటు ఇంజినీర్లలో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌తో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.






