మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఆరోగ్య మ‌హిళా కేంద్రాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో 100 వ‌ర‌కు కేంద్రాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాల‌ను ఈనెల 12 న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారుల‌ను ఇవాళ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మ‌హిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య 372కు పెరగనుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష లాంటి 8 రకాల ప్రధాన వైద్య సేవల‌ను ఆరోగ్య మ‌హిళా క్లినిక్స్ అందిస్తున్నాయి.


Next Story

Most Viewed