వినాయక చవితి స్పెషల్: తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-26 13:43:04  IST  )

వినాయక చవితి పండుగ వేళ తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Government Teachers) ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది.

వినాయక చవితి స్పెషల్: తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి పండుగ వేళ తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Government Teachers) ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబోతున్నట్లు పేర్కొంది. 880 మంది స్కూల్ అసిస్టెంట్స్‌కు, 811 మంది SGTలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కల్పించనుంది. 2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించనుంది. కాగా, ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దగ్గరే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Next Story