- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ సర్కార్
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ సర్కార్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






