- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramzan : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రంజాన్(Ramzan) పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : రంజాన్(Ramzan) పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ ప్రకటించింది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు(Holidays) ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చ్ 31న ఈదుల్ ఫితర్(Ed-Ul-Fitar)(రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇక మార్చ్ 28న జమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుండగా.. మిగతావి యధావిధిగా పనిచేస్తాయి. అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బోనాల పండగ మరుసటి రోజు, క్రిస్మస్ మరుసటి రోజు, రంజాన్ మరుసటి రోజు కూడా సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చ్ 31న ఒక్కరోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది.






