తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం

by Ajay Maddhiboyina |

తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు ప్ర‌భుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇటీవల షూటింగ్ విభాగంలో ధ‌నుష్ గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్ర‌క‌టించారు.

తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు ప్ర‌భుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇటీవల షూటింగ్ విభాగంలో ధ‌నుష్ గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్ర‌క‌టించారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇదిలా ఉంటే ధ‌నుష్ శ్రీకాంత్ ఇండియాకు చెందిన అంగ‌వైకల్యం క‌లిగిన షూట‌ర్. 19ఏళ్ల వ‌య‌సులో 2021 స‌మ్మ‌ర్ డెఫ్లింపిక్స్ లో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ అరంగేట్రం చేశాడు. జ‌ర్మ‌నీ సుహాల్‌లో 2024 సెప్టెంబ‌ర్ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియ‌న్ షిప్‌లో మూడో గోల్డ్ గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఇప్పటికే 10 మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ లో సైతం స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

Next Story