తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకూ ప్రవేశం

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Global Summit- 2025) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకూ ప్రవేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Global Summit- 2025) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌ను దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ తన బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ పెద్ద కంపెనీలు, 2000 పైగా వ్యాపారవేత్తలు, నాయకులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకూ ప్రవేశం కల్పించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. ప్రతిరోజూ MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్‌ ఎల్బీనగర్‌ నుంచి సమ్మిట్‌కు ఉచిత బస్సులు సైతం ఏర్పాటు చేశారు.

Next Story