- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు అన్నట్టుందని, దోచుకుందాం.. దాచుకుందాం అనే పనిలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader jagadeesh Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు అన్నట్టుందని, దోచుకుందాం.. దాచుకుందాం అనే పనిలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader jagadeesh Reddy) ఆరోపించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన (KCR Governance)లో కృష్ణా గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నామని, ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుపోతున్నారని చెప్పారు.
సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి..
కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని, చంద్రబాబు (Chandrababu) తన చేయాలనుకున్న నోటి దోపిడిని చేసేస్తున్నారని ఆరోపణలు చేశారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) లో ములుగు సీఆర్‌పీఎఫ్ (Mulug CRPF) బెటాలియన్ పోయి విశాఖ సీఆర్‌పీఎఫ్ (Vizag CRPF) బెటాలియన్ వచ్చిందని, సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని అన్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, తెలంగాణ నీళ్లు ఆంధ్రకు అన్నట్టు పరిస్థితి తయారైందని, చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదని, వయా చంద్రబాబు ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తమ్ సాగు నీళ్ల మంత్రి కాదు.. కన్నీళ్ల మంత్రి
సీఆర్‌పీఎఫ్ కు సాగర్ ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమేనని, సాగు నీటి మంత్రి ఉత్తమ్ (Minister Uttam) కు సోయి లేదని, దోచుకుందాం దాచుకుందాం అనే పని లో సీఎం(CM), మంత్రులు బిజీ గా ఉన్నారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోందని, మళ్ళీ సమైక్య పాలన రోజులు వస్తున్నాయని, పరిస్థితులు ఇలానే ఉంటె హైదరాబాద్ కు తాగు నీళ్లు కూడా రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ సాగు నీళ్ల మంత్రి కాదు కన్నీళ్ల మంత్రి అయ్యారని, ఉత్తమ్ నియోజవర్గంలోనే రైతులు సాగునీళ్ళు రాక కంటతడి పెడుతున్నారని తెలిపారు.
రేవంత్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం..
కేసీఆర్ మోడీ (Modi)తో బాగాలేక రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని రేవంత్ అన్నారని, ఇప్పుడు బడేభాయ్ తో బాగుండి చోటేభాయ్ ఏమి సాధించారు? ప్రశ్నించారు. సాగర్ ను ఆంధ్రా సీఆర్‌పీఎఫ్ అప్పగించడాన్ని ఆపాలని, సాగర్ పై 2023 కు ముందున్న స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతేగాక నిర్ణయం మార్చుకోకపోతే రైతులు ఎక్కడికక్కడ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. ఏఐ ని నమ్ముకోవడం కంటే ఎనుముల ఇంటలిజెన్స్ ను వాడుకుంటే రేవంత్ కు మంచిదని, ఏఐ వీడియోల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూ వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) వ్యాఖ్యానించారు.






