- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ రంగంలో ఎఐ వినియోగంపై ప్రభుత్వం ఫోకస్
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయరంగం ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందకు వెళ్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయరంగం ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందకు వెళ్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నెదర్లాండ్‌కు చెందిన ARIQT అనే కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుని సాంకేతికతను మొదటగా పరిశీలన చేసిన ఏ ప్రభుత్వ పథకాలలో సమర్థవంతంగా వినియోగించవచ్చో అంశాలను వ్యవసాయశాఖ అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. అనంతం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని రాష్ట్రంతో భాగస్వామ్యంగా తీసుకురావడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ డైరెక్టర్ గోపి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






