అత్యాధునిక పరికరాలు లేవనడం సరికాదు : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్

by Naga Rani Yarlagadda |

చార్మినార్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరగడానికి కారణం.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం, వారి వద్ద అత్యాధునిక పరికరాలు లేకపోవడం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ప్రతిపక్షాల నేతలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (Telangana Fire Disaster Response Team) స్పందించింది.

అత్యాధునిక పరికరాలు లేవనడం సరికాదు : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరగడానికి కారణం.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం, వారి వద్ద అత్యాధునిక పరికరాలు లేకపోవడం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ప్రతిపక్షాల నేతలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (Telangana Fire Disaster Response Team) స్పందించింది. ఉదయం 6.16 గంటలకు అగ్నిప్రమాదం జరగ్గా.. మొగల్ పురా ఫైర్ సిబ్బంది 10 నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారని తెలిపింది. జీ ప్లస్ 2 భవనంలో మంటలు చెలరేగాయని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్తులకు మంటలు వ్యాప్తి చెందాయని, వాటిని ఆర్పేందుకు 2 గంటల సమయం పట్టిందని వెల్లడించింది. అగ్నిమాపక రోబో సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని, స్కై లిఫ్ట్, హైడ్రాలిక్ ప్లాట్ ఫామ్స్ ను వాడామన్నారు. కాగా.. అగ్నిప్రమాదానికి అసలు కారణమేంటో తెలియాల్సి ఉందని చెప్పింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీ నాగిరెడ్డి (Fire DG Nagireddy) స్పందించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, తమ వద్ద అత్యాధునిక పరికరాలు లేవనడం సరికాదన్నారు. 11 ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేశామని, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కొందరిని కాపాడామన్నారు.

Next Story