- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పెండింగ్ బిల్లులన్నీ క్లియర్.. ఒకేసారి రూ.1,032 కోట్లు విడుదల
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బీ శాఖ(R&B Department)కు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బీ శాఖ(R&B Department)కు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆదేశాల మేరకు ఆర్థికశాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థికశాఖ(Telangana Finance Department) అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల లోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను అధికారులు విడుదల చేశారు. రోడ్లు మరియు భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లను సైతం విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.






