- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dil Raju: అనుమతి లేకుండా కొత్త సినిమాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు బస్సులు, ప్రజా రవాణా వాహనాలు, లోకల్ కేబుల్ ఛానల్స్‌లో అక్రమం

దిశ, తెలంగాణ బ్యూరో: ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు బస్సులు, ప్రజా రవాణా వాహనాలు, లోకల్ కేబుల్ ఛానల్స్‌లో అక్రమంగా ప్రదర్శిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలు, లోకల్ ఛానల్స్‌తో పాటు ఆన్‌లైన్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌లలో ఎలాంటి అనుమతి లేకుండా చాలా సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దృష్టికి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇలా చేయడం వల్ల పైరసీ కాపీరైట్ కింద నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు సినిమాలు ప్రదర్శించడం వల్ల సినీ పరిశ్రమకు ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోపాటు నిర్మాతలకు సైతం భారీ నష్టం కలగుతుందని దిల్‌రాజు పేర్కొన్నారు. అనుమతి లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే ఈ విషయాలన్నింటినీ తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయమని హెచ్చరించారు.
అక్రమంగా సినిమాలను ప్రదర్శించడం వల్ల సినీ పరిశ్రమ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సృజనాత్మకత దెబ్బ తింటుందని చెప్పారు. ఎక్కడైనా అనధికారికంగా సినిమాల ప్రదర్శనలు ఉంటే తక్షణమే నిలిపివేయాలని సూచించారు. సినిమాల ప్రదర్శనకు అనుమతుల కోసం సంబంధిత నిర్మాతలు అయిన మ్యాంగో, ఆదిత్య మూవీస్, శ్రీబాలాజీ వీడియోస్ మొదలైన ఆధికృత సంస్థలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.






