- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి వ్యవసాయం వైపు తెలంగాణ రైతుల అడుగులు.. 61 వేల ఎకరాల్లో సాగు: మంత్రి తుమ్మల
ప్రకృతి వ్యవసాయం రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ విధానం అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రకృతి వ్యవసాయం రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ విధానం అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా మంగళవారం సచివాలయంలో రైతులకు ఫార్మర్ కిట్‌ల పంపిణీ ప్రారంభించారు. రైతు నేస్తం కార్యక్రమంలో రైతు వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మంత్రి రైతులతో నేరుగా ముచ్చటించి వారి అనుభవాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 42 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా 489 క్లస్టర్లు దాదాపు 61,125 ఎకరాల్లో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం సాగు విధానంలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికా చేయడం జరిగిందన్నారు. అందుకు 61,125 మంది రైతులను ఎంపిక చేసి రైతు వేదికలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వీరికి సాగులో, మార్కెటింగ్ లో తోడ్పడే విధంగా కృషి సఖీలను క్లస్టర్ కు ఇద్దరు చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పారు.
జీవ ఉత్పాదక తయారీ కేంద్రాలు..
ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఉత్పాదకాలు స్వయంగా తయారు చేసుకోలేని రైతుల కోసం ప్రభుత్వం బీఆర్సీలను (జీవ ఉత్పాదక తయారీ కేంద్రాలు) ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రతి బీఆర్సీకి రూ లక్ష కేటాయించినట్లు తెలిపారు. ఉగాది పండుగ రోజున నర్మెట్టలో రైతు మహోత్సవాన్ని ప్రారంభించనున్నట్లు, అందులో రైతులకు ఉపయోగపడే దాదాపు 150 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైతు మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిస్తూ, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నూనె గింజలు, పప్పు దినుసులు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంలో సహకరిస్తుందని, ప్రకృతి విపత్తులు, పక్షులు, జంతువులతో కలిగే నష్టాలు తక్కువగా ఉంటాయని వివరించారు.






