రైతులకు ఉపశమనం.. యూరియా కష్టాలు తీర్చిన రేవంత్ సర్కారు

by Naga Rani Yarlagadda |

రైతులకు యూరియా కష్టాలు కాసింత తగ్గినట్లే. రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల ద్వారా పంపిణీ చేస్తుండటంతో రైతన్నలకు ఉపశమనం కలిగింది.

రైతులకు ఉపశమనం.. యూరియా కష్టాలు తీర్చిన రేవంత్ సర్కారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు యూరియా కష్టాలు కాసింత తగ్గినట్లే. రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల ద్వారా పంపిణీ చేస్తుండటంతో రైతన్నలకు ఉపశమనం కలిగింది. నెలరోజులుగా ఒక బస్తా యూరియా కోసం ఐదారు గంటల పాటు క్యూలైన్లలో నిలబడే దుస్థితి ఉండేది. దీంతో రేవంత్ సర్కారు తీరుపై అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం సహకార సంఘాల కేంద్రాలతో పాటు రైతులవేదికల ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత తగ్గుతుందని భావించింది. మూడు రోజులుగా రాష్ట్రవాప్తంగా 500 రైతు వేదికల వద్ద 500 ఈపాస్​మిషన్లు తెప్పించి సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా పంపిణీ చేపట్టింది. ముందుగానే టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా తోపులాటలు జరగకుండా అందజేస్తున్నారు. పంపిణీపై మండల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ స్టాక్​పూర్తయిన వెంటనే గోదాంల నుంచి రైతువేదికల వద్దకు సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు యూరియా స్టాక్​ను రైతు వేదికల వద్దే పంపిణీ చేస్తే బాగుండేది రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రణాళిక ప్రకారం పంపిణీ

ఏ సొసైటీకి ఎంత యూరియా కేటాయించామనే విషయం గురించి రైతులకు తెలియజేసి అవసరం మేరకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి రైతువేదిక వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేసి దానిపై రైతు వేదిక, సొసైటీ, అమ్మకాల సమయం, అధికారి పేరు, అతని ఫోన్​నెంబర్​తప్పనిసరిగా ఉండేలా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఇదిలాఉండగా, యూరియా కొరత ఏర్పడిన నాటినుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్​తో పాటు బీజేపీ నేతలు కూడా రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం ఆందోళనలు నిర్వహించారు. కానీ యూరియా కొరతకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే కారణమని రైతులకు వివరిస్తూ కేంద్రం నుంచి వచ్చిన యూరియాను ఎప్పటికప్పుడు రైతన్నలకు పంపిణీ చేస్తున్నది.

Next Story