Farmers Commission: రైతు కమిషన్​పై పల్లా రాజేశ్వర్​రెడ్డికి అవగాహన లేదు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో రైతు కమిషన్ పునరావాస కేంద్రమని చేసిన వ్యాఖ్యలపై రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Farmers Commission: రైతు కమిషన్​పై పల్లా రాజేశ్వర్​రెడ్డికి అవగాహన లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో రైతు కమిషన్ పునరావాస కేంద్రమని చేసిన వ్యాఖ్యలపై రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసిందని, దాని గురించి అవహేళన చేయడమంటే రాష్ట్రంలోని రైతులను అవహేళన చేసినట్లే అవుతుందని కమిషన్​చైర్మన్​ కోదండరెడ్డి పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషన్ బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటన చేసిందని, వ్యవసాయ క్షేత్రాలను, మార్కెట్ యార్డులను సందర్శించింది. కమిషన్ కార్యాలయంలో అనేక సమావేశాలు నిర్వహించిందన్నారు.

గత పాలకులు రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఎలాంటి అవగాహన లేకపోయిన రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉండి, రైతులకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి పని చేయకుండా సొంత పని చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలు రైతుల పట్ల వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుంటే రైతు కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చేపట్టే కార్యక్రమాలపై అవగాహన చేసుకోవచ్చని సలహా ఇచ్చారు.

Next Story