TG: పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ఈఎన్సీ లేఖ

by Prasad Jukanti |

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ఈఎన్సీ లేఖ

TG: పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ఈఎన్సీ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని ఏపీ గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టుకు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోసేందుకు ఏపీ సిద్ధమైన నేపథ్యంలో ఈ లేఖను రాసింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని అభ్యంతరం చెబుతున్న ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెబుతూ ఏపీ చేపట్టడమేంటని ప్రశ్నించారు. పోలవరం నుంచి ఏపీ ఎత్తిపోతల చేపట్టడం తగదన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల సీడబ్ల్యూసీ అనుమతులకు విరుద్ధం అని వాదన వినిపించారు. తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలని కోరింది. గోదావరి డెల్టా అవసరాలకు నష్టం జరుగుతుందని పేర్కొంది.

Next Story