- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి తెలంగాణ విద్యుత్ బకాయిలు.. కీలక ఆదేశాలు హైకోర్ట్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు(TGDISCOMs) భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు(TGDISCOMs) భారీ ఊరట లభించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) జారీ చేసిన రూ.179 కోట్ల విద్యుత్ బకాయిల నోటీసుపై తెలంగాణ హైకోర్టు(High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిల వసూలుకు సంబంధించి TSDISCOMsపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రాన్ని ఉత్తర్వుల్లో ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPAs)కు సంబంధించిన బకాయిల చెల్లింపులపై తలెత్తిన వివాదంపై ఈ స్టే ఆర్డర్ జారీ అయింది. TSDISCOMs తరఫున న్యాయవాది.. ఈ బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ వివాదాన్ని కోర్టులో కాకుండా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TSERC) లేదా ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వరకు చర్యలను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్ట్.






