- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు: అధికారులకు ఎస్ఈసీ ఆదేశం
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం నిన్న (మంగళవారం) ప్రకటించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం నిన్న (మంగళవారం) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం ఉన్నత అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం (రేపు) నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియ, గ్రామాల్లో భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై ఆమె చర్చించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
Next Story






