Election Commission: హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన తెలంగాణ ఎన్నికల సంఘం

by Ramesh Naini |

హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ ఎన్నికల సంఘం స్పందించింది.

Election Commission: హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన తెలంగాణ ఎన్నికల సంఘం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Local body elections) లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. అలాగే ఎన్నికల నోటిఫికేషన్‍పై కూడా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై (Telangana Election Commission) రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై (High Court orders) హైకోర్టు తీర్పును పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘం సెక్రెటరీ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కోర్డు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేయడంతో.. అప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లేనట్టేనని స్పష్టం అవుతోంది.

Next Story