TS ECET : రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-05-24 14:22:44  IST  )

తెలంగాణ ఈసెట్ ఫలితాలు(TS ECET Result) రేపు విడుదల కానున్నాయి.

TS ECET : రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఈసెట్ ఫలితాలు(TS ECET Result) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 12న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను రేపు ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వర్శిటీ వీసీ కుమార్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదికి ప్రవేశం లభిస్తుంది.

ప్రవేశం పొందడానికి 25% మార్కులు(200లో 50 మార్కులు) సాధించాలి. అయితే SC/ST విద్యార్థులకు ఈ నిబంధన లేదు. ఫలితాలతో పాటు టాప్ ర్యాంకర్ల వివరాలు రేపు ప్రకటించబడతాయి. దీని కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో వెల్లడవుతుంది. ఫలితాలకు రేపు ఉదయం 11 గంటల తర్వాత అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో అందుబాటులో ఉంటాయి.

Next Story