- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా.. కొత్త తేదీలు ఇవే
by GSrikanth |
తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాస్ తెలిపారు. మే 7న నీట్, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఉండడంతో ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష యథాతథంగా జరగనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనుంది.
Next Story






