- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ దందాపై ‘ఈగల్’ పంజా.. చైన్ లింక్ నెట్‌వర్క్‌పై నిఘా
డ్రగ్స్ అక్రమ రవాణా, వాడకంపై ఈగల్ టీమ్ ఫోకస్ పెంచింది. గొలుసుకట్టు ముఠాలను ఛేదించడంలో కీలక అడుగులు వేసింది.

- గతేడాది రూ.173 కోట్ల సరుకు పట్టివేత
- 31 శాతం పెరిగిన కేసుల నమోదు
- 8,322 మంది నిందితుల గుర్తింపు
- మత్తుకు బానిసకాకుండా యువతకు కౌన్సెలింగ్, పునరావాస చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా, వాడకం పై ఈగల్ ఉక్కుపాదం మోపుతున్నది. చాప కింద నీరులా పాకుతున్న ఈ దందాపై ని రంతరం నిఘాతో సంస్థ సఫలీకృతమైంది. గంజాయి సాగు నుంచి విక్రయం వరకు వి స్తరించిన గొలుసుకట్టు ముఠాలను ఛేదించడంలో కీలక అడుగులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఇంటెలిజెన్స్ ఆధారి త ఆపరేషన్లతో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్‌లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) దూకుడు గా దాడులు చేపట్టింది. గతేడాదితో పోలిస్తే డ్రగ్స్ కేసుల నమోదు 31 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పోలీసు శాఖ విడుదల చేసిన 2025 నివేదికలను పరిశీలిస్తే రాష్ట్రంలో నమోదైన డ్రగ్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం వంటి విభాగాల్లో మొత్తం 8,322 మందిని నిందితులుగా గుర్తించారు. 2024 నాటి రిపోర్టుతో పోలిస్తే నిందితుల సంఖ్య 39 శాతానికి పెరిగింది. వీరిలో అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాలకు చెందిన కీలక వ్యక్తులు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వాహనాల తనిఖీలు పెంచారు.
డ్రగ్స్ భూతంపై అవేర్‌నెస్
డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాలేజీలు, యూనివర్సిటీలు, ఐటీ కంపెనీల్లో చైతన్యం కల్పించేందుకు ఈగల్ తరఫున ప్రత్యేక క్యాంపెయిన్లు చేపట్టారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి కౌన్సెలింగ్, పునరావాస చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ సరఫరా చైన్ లింక్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారి నుంచి చట్టపరంగా ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ‘ఈగల్’ అధికారులు తెలిపారు.
నెట్ వర్క్‌లపై ఉక్కుపాదం
2025లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ తదితర మాదకద్రవ్యాలను కలిపి సుమారు రూ.173 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2024లో పోలిస్తే 25 శాతం ఎక్కువ విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 2025లో జీడిమెట్ల ప్రాంతంలో నిర్వహించిన దాడిలో రూ.72 కోట్ల విలువైన 220 కిలోల ఎఫెడ్రిన్, డ్రగ్ తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశాలకు మళ్లించే అంతర్జాతీయ హవాలా ముఠాను గుట్టురట్టు చేసి ముంబైలో రూ.మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహీంద్రా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల సమీపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లోని పబ్బులపై ఆకస్మికంగా దాడులు చేసి డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకున్నారు. అల్ఫోజోలం కలిపి కల్లు విక్రయిస్తున్న స్థావరాలపైనా దాడులు చేసి అక్రమ నిల్వలను సీజ్ చేశారు.






