TG News : మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కొరడా

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana)లోని మెడికల్ షాపులపై(Medical Shops) తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కొరడా ఝుళిపిస్తోంది.

TG News : మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కొరడా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని మెడికల్ షాపులపై(Medical Shops) తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA) తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 చట్టాల ప్రకారం.. మందుల నాణ్యత, సరైన ధరలు, ప్రిస్కిప్షన్ లేకపోయినా విక్రయాలు, నకిలీ మందులు, అక్రమ నిల్వలను నియంత్రిస్తూ ఈ దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఒక్క మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోనే ప్రిస్కిప్షన్ లేకపోయినా విక్రయాలు జరుపుతున్న 142 షాపులకు నోటీసులు జారీ చేశారు. అల్వాల్‌లో లైసెన్స్ లేని ఓ మెడికల్ షాపు నుండి ₹30,000 విలువైన యాంటీ-ఫంగల్, పెయిన్‌కిల్లర్స్, అంగస్తంభన మందులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో దాడులు చేసి అక్రమ మందులను స్వాధీనం చేసుకొని, నోటీసులు జారీ చేశారు.

Next Story