- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఉన్న పాకిస్తానీలకు DGP సంచలన హెచ్చరిక.. జల్లెడ పట్టి మరీ లాక్కొస్తామని ఫైర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆదేశాలతో తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్(Jitender) అప్రమత్తం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆదేశాలతో తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్(Jitender) అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌లో దాదాపు 200 పైచిలుకు పాకిస్తానీలు ఉన్నారని సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ తర్వాత వీసాలు రద్దు చేస్తామని.. ఆలోపే వెళ్లిపోవాలని ఆదేశించారు. మెడికల్ వీసా దారులకు ఈనెల 29వ తేదీ వరకూ అవకాశం ఇస్తామని.. ఆ తర్వాత క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీళ్లేదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉండాలనుకుంటే ఊరుకునేది లేదని.. జల్లెడ పట్టి బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుంది.. హైదరాబాద్2లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారు.. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామని డీజీపీ జితేందర్ రెడ్డి తెలిపారు.
అంతకుముందు.. పాకిస్తానీయులు(Pakistanis) 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్తానీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలు కల్పించారు. ఈ ప్రోగ్రామ్ కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.






