- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DSP సిరాజ్‌కు తెలంగాణ డీజీపీ అభినందనలు
DSP సిరాజ్‌కు తెలంగాణ డీజీపీ అభినందనలు

దిశ, వెబ్‌డెస్క్: లండన్ వేదికగా ఇంగ్లాండ్(England)తో జరిగిన ఐదో టెస్టులో భారత(India) జట్టు అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. భారత బౌలర్లు ఏ మాత్రం అధైర్యపడకుండా అద్భుతంగా పోరాడారు. ఒక్కో వికెట్టూ పడగొడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఆఖరి రోజూ మరింత విజృంభించి ఇంగ్లాండ్ చేతిలోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) అద్భుతంగా రాణించారు. కీలక మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు మరుపురాని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. సిరాజ్ ఆటతీరుపై తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘డీఎస్పీ సిరాజ్ అద్భుతంగా పోరాడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్‌లో జట్టు మరిన్ని విజయాలు అందించాలి. ప్రతీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాలి. ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించిన సిరాజ్‌కు అభినందనలు’ అని డీజీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.






