మావోయిస్టుల దాడిపై తెలంగాణ డీజీపీ ప్రకటన

by Gantepaka Srikanth |

మావోయిస్టుల(Maoists) దాడిపై తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender) అధికారిక ప్రకటన చేశారు.

మావోయిస్టుల దాడిపై తెలంగాణ డీజీపీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల(Maoists) దాడిపై తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender) అధికారిక ప్రకటన చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు వాజేడు, పేరూరులో మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చారు. ల్యాండ్‌మైన్ పేలుడులో శ్రీధర్‌, పవన్, సందీప్‌ మృతి చెందారు. ఒక రిజర్వ్‌డ్ ఎస్‌ఐ రణ్‌బీర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతిచెందిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్‌ ఉన్నట్లు సమాచారం. చంద్రన్న తలపై రూ.కోటి రివార్డు ఉంది. బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Next Story