- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులకు తెలంగాణ DGP కీలక పిలుపు
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar)పై తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌తో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ ఆపరేషన్ మొత్తం కేంద్ర బలగాలే(Central Forces) నిర్వహిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ఇంకా రాష్ట్రంలో ఎవరైనా మావోయిస్టులు ఇంటే.. వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు.. హైదరాబాద్ ఉగ్ర కుట్ర సూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్‌ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉగ్రకుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఏర్పాటు దశలోనే గ్రూపును కనిపెట్టి విచ్ఛిన్నం చేసినట్లు తెలిపారు.






