- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ మరో పిలుపు
దండకారణ్యంలో మిగిలిపోయిన 17 మంది తెలంగాణ మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి మరో కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: దండకారణ్యంలో మిగిలిపోయిన 17 మంది తెలంగాణ మావోయిస్టు(Telangana Maoists)లకు డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) మరో కీలక పిలుపునిచ్చారు. పునరావాసం కల్పించడంతో పాటు, వారి మీదున్న రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అడవుల్లో ఉండి పోరాటం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని.. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా మావోయిస్టులు ఉండేవారని.. ఇప్పుడు వారి సంఖ్య 66కు చేరిందన్నారు డీజీపీ. ఈ సంఖ్యను బట్టిచూస్తే పీఎల్‌జీ పూర్తిగా క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒకరు మాత్రమే తెలంగాణ రాష్ట్ర కమిటీ వారు మావోల్లో మిగిలారని వివరించారు. సీఎం పిలుపుతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలిపారు. డివిజన్ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ.4 లక్షలు, మిగతా సభ్యులకు రూ.1 లక్ష రివార్డు అందజేస్తామని భరోసా ఇచ్చారు.






