- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్.. 8712672222 నంబర్‌కు కాల్ చేయాలన్న తెలంగాణ పోలీసులు
ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.

ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎక్స్’లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోస్ట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేసేనట్లుగా మీ దృష్టికి వస్తే.. 8712672222కు వాట్సాప్ చేయాలని సూచించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇంకా ఏం చెప్పిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
పహెల్గాం ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత వైమానిక దళం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరు ట్రేడ్‌మార్క్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో పలు సంస్థలు హడావుడిగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో ప్రధానంగా బిలియనీర్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ కూడా ఉంది. అసలు ఎందుకు ఈ పేరుకు అంత కాంపిటేషన్ నెలకొంది.. ఎవరెవరు పోటీపడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే..
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను అందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలోని ఆస్థానమండపంలో ఇవాళ్ల హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. హోటల్ నిర్వాహకులు, సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణ చేయాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలన్నారు. అన్ని దుకాణాలలో ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ జర్నీకి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి మహిళలు ఉచిత టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. తాజాగా దీనిపై సజ్జనార్ ఎందుకు స్పందించారు? ఆ నిర్ణయం వెనక కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






