- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూరత్ లో తెలంగాణ సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
సైబర్ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన 20 మంది నిందితులను గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ క్రైమ్ డీజీ శిఖా గోయల్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సైబర్ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన 20 మంది నిందితులను గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ క్రైమ్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మే1 తేది నుంచి 10 వరకు సూరత్ లో టీజీసీఎస్బీ బృందాలు ప్రత్యేక నిఘా ఉంచి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన నిందితులు తెలంగాణ వ్యాప్తంగా 60 కేసులలో నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 515 కేసులలో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. టీజీసీఎస్బీ చెపట్టిన 5వ అతి పెద్ద ఆపరేషన్ గా తెలిపారు. 27 మ్యూల్ ఖాతాల ద్వారా దాదాపు రూ. 4.77 కోట్లు అనుమానాస్పద లావాదేవిలు జరిపారని తెలిపారు. 14 మంది మ్యూల్ ఖాతాదారులను , 6 ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ. 22,64,500 విత్‌డ్రా చేశారని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. నిందితులలో ఓ బ్యాంకు ఉద్యోగి ఉన్నట్లు , ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లు పేర్కోన్నారు. వారి నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎం కార్డులు ,5 చెక్ బుక్స్, 2 పాన్ కార్డులు, 2 రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి ట్రాన్సిట్ వారెంట్ల పై రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు తెలిపారు.






