Breaking News: మే 9న ఎంసెట్.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-01-25 12:30:38  IST  )

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది...

Breaking News: మే 9న ఎంసెట్.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేనరకు మే 6న ఈసెట్, 9న ఎంసెట్, 23న ఎడ్ సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5న ఐసెట్, జూన్ 6న పీజీ ఈసెట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించిన ఉన్నత విద్యామండలి తీవ్ర కసరత్తులు చేసింది. ఇందులో భాగంగా రాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు. గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఆమోదం తీసుకున్నారు. దీంతో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. విద్యార్థులు ఆయా పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకులు సాధించాలని అధికారులు కోరారు.

Next Story