Telangana Congress: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన

by Ramesh Goud |   (  Updated:2024-12-09 09:38:27  IST  )

మణిపూర్(Manipur) అల్లర్ల అంశం పై పార్లమెంట్ లో చర్చ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు(Telangana Congress MPs) నిరసన(Protest)లో పాల్గొన్నారు.

Telangana Congress: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్(Manipur) అల్లర్ల అంశం పై పార్లమెంట్ లో చర్చ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు(Telangana Congress MPs) నిరసన(Protest)లో పాల్గొన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో మణిపూర్ లో జరిగిన అల్లర్లపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే దీనిపై నిరసన తెలుపుతూ.. ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్(Janthar Manthar) వద్ద ఇండియా కూటమి(India Alliance) ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు మల్లురవి(Mallu Ravi), రఘురాంరెడ్డి(Raghuram Reddy), చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) సహా ఇతర ఎంపీలతో ఆందోళన చేపట్టారు. మణిపూర్ అల్లర్ల అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగకుండా బీజేపీ అడ్డుపడుతోందని, దీనిపై పార్లమెంట్ లో కనీసం ఐదు నిమిషాల పాటు చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్ అల్లర్లు జరిగి ఇప్పటికీ ఏడాదిన్నర గడుస్తున్నా దానిపై బీజేపీ ప్రభుత్వం కనీసం చర్చ చేయడం లేదని, మణిపూర్ ప్రజలకు సమాధానం చెప్పడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడుతున్నారు.

Next Story