మంత్రి హరీశ్ రావుపై కాల్వ సుజాత సీరియస్ (వీడియో)

by Disha Web Desk 2 |
మంత్రి హరీశ్ రావుపై కాల్వ సుజాత సీరియస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపై స్పందించిన ప్రభుత్వం తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ వేసి, విచారణ జరిపిస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెసు అధికార ప్రతినిధి కల్వ సుజాత స్పందించారు. 'దిశ'తో ఆమె మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హెల్త్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈ ఘటనను చూస్తే.. తెలుస్తోందని మండిపడ్డారు. చిన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె చేసిన కామెంట్లు స్వయంగా ఆమె మాటల్లోనే వినడానికి



Next Story