PAC నుంచి జానారెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి సహా సీనియర్లు అవుట్.. పూర్తిస్థాయి కార్యవర్గం పెండింగ్!

by Gantepaka Srikanth |

కాంగ్రెస్​పార్టీ కార్యవర్గంలోని అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. కార్యవర్గంలోని వర్కింగ్​ప్రెసిడెంట్లు, వైస్​ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు.

PAC నుంచి జానారెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి సహా సీనియర్లు అవుట్.. పూర్తిస్థాయి కార్యవర్గం పెండింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ కార్యవర్గంలోని అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. కార్యవర్గంలోని వర్కింగ్​ప్రెసిడెంట్లు, వైస్​ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే మరల ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, క్రమశిక్షణ కమిటీలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్​ఖర్గే ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఆయా కమిటీలను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆయా కమిటీలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున​ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు ఈ కమిటీలకు ఆమోద ముద్ర వేశారు. వర్కింగ్​ప్రెసిడెంట్లు, వైస్​ప్రెసిడెంట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్‌ పెట్టినట్లుగా సమాచారం. త్వరలోనే వాటిని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తం 5 కమిటీలను ప్రకటించగా.. పీఏసీ కమిటీలో 22 మంది, సీనియర్లు అందరినీ కలిపి అడ్వయిజరీ​ కమిటీని ఏర్పాటు చేశారు. మొదటి సారిగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా​ఎంపీ మల్లు రవిని నియమించారు. ఇప్పటివరకు ఈ పదవిలో చిన్నారెడ్డి ఉన్నారు. కొత్త డీలిమిటేషన్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.

పీఏసీ నుంచి సీనియర్లు అవుట్​...

పొలిటికల్​అఫైర్స్​కమిటీ(పీఏసీ)లో పలువురు ప్రముఖులకు చోటు దక్కలేదు. ఇందులో సీనియర్​నేత జానారెడ్డి, హనుమంతరావు, మధుయాష్కీ, గీతారెడ్డి, జగ్గారెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఎంపీలకు కూడా పీఏసీలో చోటు కల్పించలేదు. పీఏసీలో రాష్ట్ర మంత్రులందరు సభ్యులుగా ఉంటారని, అనుబంధ సంఘాల సభ్యులు, పీసీసీ వర్కింగ్​ప్రసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులందరూ పీఏసీలు సభ్యులుగా ఉండనున్నారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ..

రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, డి. అనసూయ సీతక్క, ఎంపీలు జి. రేణుకా చౌదరి, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నేతలు చల్లా వంశీచందర్​రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, వి. శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పి. సుదర్శన్ రెడ్డి, కె. ప్రేమ్‌సాగర్ రావు, జెట్టి కుసుమ కుమార్, ఈరవత్రి అనిల్ కుమార్ సభ్యలుగా ఉంటారు. వీరితో పాటుగా ఎక్స్-అఫీషియో సభ్యులుగా.. తెలంగాణకు అనుబంధంగా ఉన్న అన్ని ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల అధిపతులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు.

అడ్వయిజరీ కమిటీ..

ఈ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. సీనియర్లందరినీ ఈ కమిటీలో చేర్చారు. పీఏసీలో ఉన్న వారికి ఇక్కడ అవకాశం కల్పించారు. ఇందులో మీనాక్షి నటరాజన్, ఎ.రేవంత్ రెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్, వి. హనుమంత రావు, కె. జానా రెడ్డి, కె. కేశవ రావు, మధు యాష్కి గౌడ్, జి.చిన్నారెడ్డి, జె గీతారెడ్డి, ఎం.అంజన్ కుమార్ యాదవ్, టి.జయప్రకాష్ రెడ్డి, జాఫర్ జావేద్, టి.జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఎస్.రాములునాయక్‌లు ఉన్నారు.

డీలిమిటేషన్ కమిటీ..

దీనిలో చైర్మన్‌గా చల్లా వంశీచందర్​రెడ్డి, సభ్యులుగా గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యానారాయణ, డా. శ్రావణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాడి, డి. వెంకటరమణ ఉన్నారు.

సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ..

సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా పి వినయ్ కుమార్, సభ్యులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కె. శంకరయ్య, ఎమ్మెల్మే ఎన్. బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యే హర్కల నర్సారెడ్డి, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వర్, గొల్కొండ సంతోష్, డాక్టర్ పులి అనిల్ కుమార్, జూలూరి ధనలక్ష్మి, మజీద్ ఖాన్, డాక్టర్​జి.రాములు, అర్జున్ రావు, సౌరి, కొల్లం వల్లభ్ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.

క్రమశిక్షణా కమిటీ

క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఎంపీ మల్లు రవిని నియమించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో జి.చిన్నారెడ్డి ఉన్నారు. చైర్మన్‌గా​ఎంపీ మల్లు రవి, వైస్​చైర్మన్‌​ఎ. శ్యామ్ మోహన్, సభ్యులు ఎం. నిరంజన్ రెడ్డి, బి. కమలాకర్ రావు, జాఫర్ జావెద్, డాక్టర్ జి.వి.రామకృష్ణలను నియమించారు.

Next Story