పేపర్ లీక్ కేసులకు స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు: ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-24 03:01:54  IST  )

ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ హైకోర్టు నుంచి సంచలన ఉత్తర్వుల వెలువడ్డాయి.

పేపర్ లీక్ కేసులకు స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు: ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీ కేసులలో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ హైకోర్టు వేగంగా స్పందించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ -2024 కింద నమోదైన కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రత్యేక సీబీఐ జడ్జిగా జుడీషియల్ ఆఫీసర్ అను గ్రోవర్ బాలిగాను నియమిస్తూ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల అక్రమాల నిరోధక చట్టం, అందుకు సంబంధించిన సంబంధించిన కేసులన్నీ తక్షణమే ఈ కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నారు. 2024 యాంటీ-చీటింగ్ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్టం NTA, UPSC, SSC, RRB, IBPS వంటి కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలకు వర్తించనుంది.





Next Story