తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత VH కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

కులగణన(Caste Census) కోసం రోడ్లపైకి వచ్చి యుద్ధం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు(V. Hanumantha Rao) కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత VH కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన(Caste Census) కోసం రోడ్లపైకి వచ్చి యుద్ధం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు(V. Hanumantha Rao) కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం జనగణన అంటోంది కానీ.. కులగణన ప్రస్తావన చేయడం లేదని మండిపడ్డారు. జనగణన(Census) వల్ల బీజేపీకి తప్ప ఎవరికీ లాభం లేదు.. ముఖ్యంగా బీసీలకు(BC Caste) జరిగే ఉపయోగం శూన్యమని అన్నారు. కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాలని కోరారు. కాగా, దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌‌ను కేంద్రం విడుదల చేసింది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వది కాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. 2027 మార్చి 1వ తేదీ నాటికి ఇది పూర్తి కానుంది. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Next Story