‘పౌరుషం మాటల్లో కాదు.. చేతల్లో చూపించు’: బండి సంజయ్‌కి మహేశ్ గౌడ్ సంచలన సవాల్

by Gantepaka Srikanth |

కేసీఆర్(KCR) కుటుంబం, బండి సంజయ్‌(Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘పౌరుషం మాటల్లో కాదు.. చేతల్లో చూపించు’: బండి సంజయ్‌కి మహేశ్ గౌడ్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్(KCR) కుటుంబం, బండి సంజయ్‌(Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా కవితనే చెప్పారు. ఆమె మాటలు విన్నాక వాటాల్లో తేడాలు వచ్చాయని అనిపించింది. ఆ తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయనిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కవిత(Kavitha) ఇదే మాట చెప్పి ఉంటే.. అప్పుడే సన్మానం చేసేవాళ్లం. ఇప్పుడు ఆమె వరకూ వచ్చాక విమర్శలు చేస్తున్నది. ఇదంతా డ్రామా అని ప్రజలు గ్రహించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) ఉండదు అని నేను ఏడాది క్రితమే చెప్పాను. కవితతో ఈ డ్రామా కేసీఆరే ఆడిస్తున్నారనే అనుమానం మాకూ ఉంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్‌కి సవాల్ :

రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్‌ అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టం కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి బాగోతం బయట పెట్టేందుకు కామారెడ్డి బీసీల సభ తలపెట్టామని అన్నారు. బీజేపీ నేతలు దేవుడి పేరిట ఓట్లు అడుక్కునే భిక్షగాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బండి సంజయ్ బీసీ ద్రోహిలా మారారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బండి సంజయ్ బయటకు రావాలి. పదే పదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు. అంత పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలి అని బండి సంజయ్‌కి మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.

Next Story