- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T-కాంగ్రెస్ మరో బిగ్ ప్లాన్.. ఈ సారి రంగంలోకి డీకే!
by Satheesh |
కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌లో ఉన్న కాంగ్రెస్పార్టీ, తెలంగాణలోనూ ఆ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌లో ఉన్న కాంగ్రెస్పార్టీ, తెలంగాణలోనూ ఆ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నది. ప్రజల మెప్పును పొందేందుకు డిక్లరేషన్ల పేరిట ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే రైతు, యూత్డిక్లరేషన్లు ప్రకటించగా, త్వరలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. దీన్ని విడుదల చేసేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించినట్లు సమాచారం. ఆ నేతలు కూడా తెలంగాణ రాకకు గ్రీన్సిగ్నల్ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో భారీ సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోన్నది. హైదరాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మ టౌన్‌లను సభ కోసం పరిశీలిస్తున్నారు. గ్రౌండ్ సక్సెస్ చేసేందుకు సభాస్థలి ఎంపిక బాధ్యతలకు కూడా కాంగ్రెస్పార్టీ కమిటిని వేసింది.
Next Story






