JP Nadda: రాష్ట్రంలో యూరియా కొరత.. జేపీ నడ్డాతో టీ కాంగ్రెస్ ఎంపీల భేటీ

by Prasad Jukanti |

జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు.

JP Nadda: రాష్ట్రంలో యూరియా కొరత.. జేపీ నడ్డాతో టీ కాంగ్రెస్ ఎంపీల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యం చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను (JP Nadda) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు (T Congress MP's) కలిశారు. తెలంగాణకు రావాల్సిన యూరియాపై చర్చించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఎంపీల విజ్ఞప్తిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. రేపు మరోసారి జేపీ నడ్డాను ఎంపీలు కలవనున్నాట్లు సమాచారం.

కాగా రాష్ట్రంలో యూరియా కొరతపై ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణాలో యూరియా కొరతపై పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ వాయిదా తీర్మాణాన్ని ఇచ్చింది. వాయిదా తీర్మాణం ప్రతిపాదనను లోకసభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పంపించారు.

Next Story