సుప్రీంకోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటిషన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-29 11:31:02  IST  )

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao), కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.

సుప్రీంకోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao), కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. లంబాడీలు, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొందరు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి మా హక్కులను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. 1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి ఆదేశాలు జారీ చేసింది.

Next Story