- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ.కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్.. హుటాహుటిన ఢిల్లీకి పరుగులు
ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు..

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi)కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు(Telangana Congress Leaders) క్యూ కట్టారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ(Cabinet expansion) ఆదివారం ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధిష్టానం వద్ద కేబినెట్ బెర్త్ ఖరారు చేయించుకునేందుకు ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హుటాహుటిన హస్తినకు బయల్దేరి వెళ్లారు. మొత్తం ముగ్గురికి కొత్తగా కేబినెట్‌లో చోటు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు వివేక్ వెంకట స్వామి, బాలునాయక్, మల్ రెడ్డి రంగారెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు వారంతా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. ఈ రాత్రికే హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ కేబినెట్ కొత్త మంత్రులను ఆదివారం ప్రకటించనున్నారని సమాచారం. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.






