తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Madhu Goud Yaskhi) తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Madhu Goud Yaskhi) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయబద్ధంగా విచారణ జరగాలని కమిషన్ వేశారు. కమిషన్ అధికారులు ఇచ్చిన ఆధారాలతోనే అప్పటి సీఎం కేసీఆర్‌(KCR)కు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చారు. అసలు డ్యామ్‌కు, టన్నెల్‌కు తేడా ఏంటో కవితకు తెలుసా? అని మధుయాష్కీ ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కుటుంబం సర్వం దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం చేసిన పోరాటంపై డాక్యుమెంటరీ తయారు చేస్తున్నామని కీలక ప్రకటన చేశారు.

అంతకుముందు కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని అన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు. అది కాళేశ్వరం కమిషన్‌ కాదు.. అది కాంగ్రెస్‌ కమిషన్‌, రాజకీయ కమిషన్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారు. దీనిని కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని అన్నారు.

Next Story