- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూతూ మంత్రంగా క్రమశిక్షణ కమిటీ.. ఛైర్మన్ గా మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న కమిటీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని వైనం
- మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళీ
- కలికట్టుగా పనిచేసేందుకు అంగీకారం
- క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న కమిటీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా కొనసాగుతున్నప్పటికీ వారిని సమస్వయం చేసి సరైన మార్గంలో పెట్టే చర్యలేమి కనిపించడం లేదు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, పెద్దనాయకులపై ఫిర్యాదులు వస్తే చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారు. తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిపై అనేక సార్లు విమర్శించారు. మీడియా ముందు కూడా ఆయన ప్రకటనలు చేశారు.
ఈ అంశంపై కమిటీ చైర్మన్ మల్లు రవి స్వయంగా రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఆ అంశం కమిటీ దృష్టికే రాలేదని చెప్పడం విడ్డూరం. అంతే కాకుండా కొండా మురళీపై ఉమ్మడి వరంగల్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ కమిటీలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దిగువ స్థాయి క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఫిర్యాదులపై కమిటీ ఏం చర్యలు తీసుకుంటుందోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారికి ఆదివారం నిర్వహించిన క్రమశిక్షణ కమిటీ సమావేశం నిరాశ కలిగించదని ఆయా జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళీ మరోసారి హాజరయ్యారు. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. అందులో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీ, జడ్చర్ల ఎమ్మెల్లే అనురుధ్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో చర్చించామని అన్నారు. భవిష్యత్ జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కలసి పని చేయడానికి ఒప్పుకున్నారని అన్నారు.
అనిరుధ్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్చించామని చెప్పారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఆయనకు సంబంధించిన అంశంపై ఎలాంటి ఫిర్యాదు కమిటీ దృష్టికి రాలేదన్నారు. కొండా మురళీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తప్పా మరే పార్టీలో ఉండలేనన్నారు. పార్టీ ఆదేశాలు పాటిస్తూ.. పార్టీ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పారు. రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో అందరం కలసి పని చేయాలని చైర్మన్ సూచించారు అలాగే చేస్తామని చెప్పామన్నారు. జరిగిన ప్రతి అంశంపై వివరణ ఇచ్చామని, కమిటీ సంతృప్తి చెందిందని చెప్పారు. కాంగ్రెస్ మా రక్తంలో ఉంది. పార్టీ ఏ ఆదేశం చేసినా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు.






