Congress: కాంగ్రెస్ “జనహిత” పాదయాత్రకు సర్వం సిద్ధం.. ఎక్కడి నుంచి ప్రారంభం అంటే?

by Ramesh Naini |

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న “జనహిత” పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.

Congress: కాంగ్రెస్ “జనహిత” పాదయాత్రకు సర్వం సిద్ధం.. ఎక్కడి నుంచి ప్రారంభం అంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న “జనహిత” పాదయాత్ర (Padayatra), శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిగిలో జనహిత (Janahita) పాదయాత్ర ప్రారంభంకానున్నది. “జనహిత” పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ (TPCC Chief Mahesh Kumar Goud)తో కలిసి ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో పాల్గొననున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పరిగి నుంచి ఖానాపూర్ వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 4వ తేదీ ఖానాపూర్ లో మొదటి విడత పాదయాత్ర ముగియనున్నది. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభ ప్రాంగణం కటౌట్లు, ప్లెక్సీలతో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారీగా తరలి వచ్చి పాదయాత్ర లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ ని సంస్థాగత నిర్మాణం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.

Next Story