బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ మళ్లీ ఫిర్యాదు

by Gantepaka Srikanth |

బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ మళ్లీ ఫిర్యాదు

బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ మళ్లీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy).. కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్(CR Patil)తో భేటీ అయ్యారు. తెలంగాణలో పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించినట్లు స్పష్టంగా చెప్పారు. దాంతో ప్రాజెక్టు పేరు మార్చి మళ్లీ అనుమతుల కోసం ఏపీ ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచొద్దని గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టు స్టే ఉన్నా, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తుందనీ చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి.. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. కృష్ణా గోదావరి నది జలాల్లో తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలి.. సంబంధిత ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలి.. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తెలంగాణలో నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలి.. 90 టీఎంసీల నీటి కేటాయింపులుగాను మొదటి దశలో మైనర్ ఇరిగేషన్లు పొదుపు కింద ఉన్న 45 టీఎంసీలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి.. సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలను ఇప్పటికే నివృత్తి చేశాం వెంటనే అనుమతులు ఇవ్వాలి.. పోలవరం నుంచి వరద జలాలను తరలించే ఏపీ ప్రయత్నాలను కేంద్రమే నిలువరించాలని సీఆర్ పాటిల్‌కు ఉత్తమ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story