మంత్రి అప్పలరాజుకు AP CMO వార్నింగ్

by GSrikanth |
మంత్రి అప్పలరాజుకు AP CMO వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా సైలెంట్ అయిన బీఆర్ఎస్, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మరోసారి తారాస్థాయికి చేరుకుంది. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మినిస్టర్ సిదిరి అప్పల రాజు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో సిదిరిపై ఏపీ సీఎంవో సీరియస్ అయింది. నేతలపై మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని సీఎంవో హెచ్చరించింది. కాగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు ప్రాంతీయ ఉగ్రవాదులు అంటూ అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి.. సీఎం కేసీఆర్, ఇతర ముఖ్య నేతలను ఉగ్రవాదులుగా పేర్కొనడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే తప్ప అవి శృతి మించకూడదని సోషల్ మీడియాలో సిదిరిపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఏపీ సీఎంవో ఈ మేరకు అప్పలరాజును వారించినట్లు సమాచారం.

Also Read...

కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడితోనే అది సాధ్యం: కేటీఆర్

Next Story

Most Viewed