- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ సారథ్యంలో తమిళనాడు కొత్త శిఖరాలను అధిరోహించాలి : సీఎం రేవంత్ రెడ్డి
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరికీ సమన్యాయం, సంక్షేమంతో కూడిన ఉత్తమ పాలనను మీరు అందిస్తారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






