కృష్ణంరాజు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

by Disha Web |
కృష్ణంరాజు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వెండితెరకు కృష్ణంరాజు మరణం తీరని లోటని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పనిచేసి దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు. సినిమాల్లో అద్భుతంగా రాణించి, రెబల్ స్టార్‌గా అభిమానుల గుండెళ్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Also Read : రాజకీయాల్లోనూ కృష్ణంరాజు చెరగని ముద్రNext Story

Most Viewed