- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ సెకండ్ వీక్‌లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే సర్పంచ్ఎన్నికలు ముందు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తోంది.
మరోవైపు.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పీటముడితో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం చేసినా రాజకీయ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో 50శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలుచేసి, కాంగ్రెస్పార్టీ పరంగా 42శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన విషయమూ తెలిసిందే.
ఇప్పటికే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వానికి 50శాతం రిజర్వేషన్లు అమలు చేయడం మినహా మరే మార్గం లేకుండా అయింది. ఎన్నికల నిర్వహణపై ఏం చేయబోతున్నారనే దానిపై హైకోర్టులో ఈనెల 24న కేసు విచారణ జరగనుంది. హైకోర్టు తీవ్ర ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.






